రాజ్ నిడిమోరుతో పికిల్‌బాల్ ఆడిన సమంత.. కర్మ సిద్ధాంతంపై డైరెక్టర్ సతీమణి ఇంట్రెస్టింగ్ పోస్ట్

Image 1

అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్‌ నిడిమోరు గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇద్దరూ తరచుగా కలిసి కనిపిస్తుండటంతో డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇటీవల 'శుభం' సినిమా రిలీజైన తర్వాత, సామ్ తన ఇన్స్టాగ్రామ్ లో రాజ్ నిడిమోరుతో క్లోజ్ గా ఉన్న ఓ ఫోటోని షేర్ చేయడం హాట్ టాపిక్ అయింది. రీసెంట్ గా రాజ్ తో కలిసి పికిల్‌బాల్ ఆడిన వీడియోని సమంత పోస్ట్ చేసింది. దీనిపై చర్చలు జరుగుతున్న టైంలో, రాజ్‌ నిడిమోరు సతీమణి ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

రాజ్‌ నిడిమోరు భార్య శ్యామాలి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సందేశాత్మక పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. లేటెస్టుగా ఆమె కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ షేర్‌ చేసింది. ''కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది. ఈ విశ్వం దీనిని నిశితంగా చూస్తుంటుంది'' అని రాసి ఉన్న ఓ నోట్ ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసుకుంది. దానికి కర్మ, నువ్వు ఏం ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అనే హ్యాష్‌ ట్యాగ్స్‌ను జత చేసింది. ''ఆత్మ మేల్కొన్నప్పుడు ప్రతిదీ అర్ధమవుతుంది'' అని మరో సందేశాన్ని పంచుకుంది.

శ్యామాలి పోస్ట్ చేసిన ఈ సందేశాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సామ్ - రాజ్ డేటింగ్ రూమర్స్ చక్కర్లు కొడుతున్న తరుణంలో, దర్శకుడి భార్య పోస్ట్ వెనుక ఇంకేదైనా సారాంశం ఉందా? అని మాట్లాడుకుంటున్నారు. విమానంలో రాజ్‌ నిడిమోరు భుజంపై సమంత తలవాల్చిన ఫోటోని పోస్ట్ చేసిన సమయంలోనూ శ్యామాలి ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ''నా గురించి ఆలోచించేవారు. నన్ను చూసేవారు. నాతో మాట్లాడేవారు. నా గురించి మాట్లాడేవారు. నా గురించి వినేవారు. వినిపించేవారు. నా గురించి చదివి, నా గురించి వ్రాసేవారు. ఈ రోజు నన్ను కలిసే ప్రతి ఒక్కరికీ నేను ప్రేమ, ఆశీస్సులను పంపుతున్నా" అనే కోట్ ను షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

సమంత రూత్ ప్రభు 'హ్యాపీ వీకెండ్' అంటూ శనివారం జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోలతో పాటు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. వాటిల్లో రాజ్ నిడిమోరుతో కలిసి సామ్ పికిల్ బాల్ ఆడుతూ కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి వీరి బంధంపై నెట్టింట చర్చ మొదలైంది. అదే సమయంలో రాజ్ వైఫ్ శ్యామాలి పోస్ట్‌ షేర్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

రాజ్‌- డీకే సంయుక్తంగా రూపొందించిన 'ది ఫ్యామిలీ మ్యాన్‌' సీజన్‌-2 సిరీస్ తో సమంత ఓటీటీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దర్శక ద్వయం తెరకెక్కించిన 'సిటడెల్‌: హనీ బన్నీ' సిరీస్ లోనూ సామ్ నటించారు. ఇటీవల సమంత నిర్మాణంలో వచ్చిన 'శుభం' సినిమాకి రాజ్‌ నిడిమోరు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం రాజ్‌- డీకే రూపొందిస్తున్న 'రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్'లోనూ సమంత నటిస్తున్నారు.

Related News